Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగ అప్డేట్ ఇచ్చేసిన హరీష్ శంకర్
పవన్ కల్యాణ్( Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భీమ్లా నాయక్”( Bheemla Nayak) మూవీ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తొలి 3 రోజుల్లోనే 100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీర మల్లు’ (hari hara vira mallu) తో పాటుగా హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’(Bhavadeeyudu Bhagat Singh) సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో సూపర్ హిట్ కొట్టిన గబ్బర్ సింగ్(Gabbar Singh) చిత్రం తర్వాత మళ్లీ హరీశ్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ కాంబో రిపీట్ కానుంది.
దీంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
అయితే మహాహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, నవీన్ ఎర్నేని కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి కూడా ‘గబ్బర్ సింగ్’ సినిమాకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ (DSP) స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది.
Recent Comment