Bigg Boss Non Stop : నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే . ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో స్ట్రీమింగ్ అవుకున్న ఈ షోకి సైతం నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24*7 నాన్ స్టాప్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మెగా షో 84 రోజులు పాటు నిరంతరంగా ప్రసారం కానుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఈసారి కూడా నాగార్జున బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. గత సీజన్‌కు 12 కోట్ల దాకా పారితోషికం తీసుకున్న నాగార్జున ఈసారి దాన్ని కొంత తగ్గించి దాదాపు రూ. 9 కోట్ల మేర తీసుకున్నట్లు సమాచారం. కాగా, గత మూడు సీజన్లలో శని, ఆది వారాల్లో కనిపించిన నాగార్జున ఈసారి అలా కాకుండా కేవలం శనివారం మాత్రమే అలరించనున్నాడు.
ఇదిలాఉండగా.. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ షోలోని మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నుంచి నటరాజ్ మాస్టర్, సరయు, అరియానా గ్లోరి, ఆర్జే చైతు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, తొలివారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఎక్కువమంది నటరాజ్ మాస్టర్ని లక్ష్యంగా చేసుకొని ఆయన మెడలో వరుసగా బోర్డ్‌లు వేయడంతో తొలివారం నామినేషన్స్ ప్రక్రియ వివాదంగా మారింది.
Recent Comment