ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్లు ప్రిథ్వి షా, వార్నర్ అర్ధ సెంచరీల తో కదం తొక్కారు. వీరిద్దరూ, మొదటి వికెట్ కు 93 పరుగులు జోడించారు. ప్రిథ్వి షా 29 బంతుల్లో 51 పరుగులు, వార్నర్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన రిషబ్ పంత్, ఆక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ధాటి గా ఆది స్కోర్ బోర్డ్ ను ను పరిగెత్తించారు.
రిషబ్ పంత్ 14 బంతుల్లో 27 పరుగులు చేయగా, ఆక్సర్ పటేల్ 14 బంతుల్లో 22 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి అజేయం గా నిలిచారు.
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా, చక్రవర్తి, రస్సెల్, ఉమేష్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం 216 పరుగుల భారి లక్ష్య చేధనకు బరిలో దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 171 పరుగులకు అవుట్ అయ్యింది.
ఓపెనర్లు రహానే, వెంకటేష్ అయ్యర్ తక్కువ స్కోర్ల కే అవుట్ అవ్వడం తో కష్టాల్లో పడింది. శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా ఆచి తూచి ఆడుతూ మూడవ వికెట్ కు 69 పరుగులు జోడించారు. శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 54 పరుగులు చేసి కుల్దీప్ అయ్యర్ చేతికి చిక్కాడు. నితీష్ రానా 20 బంతుల్లో 30 పరుగులు చేసి లలిత్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రస్సెల్ 24 పరుగులకే ఔట్ అయ్యాడు
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ల లో కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. శార్దూల ఠాకూర్ రెండు వికెట్లు తీయగా, లలిత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు
Recent Comment