RRR Collections: ‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. (RRR) ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
అయితే విడుదలకు ముందే పలు రికార్డులను సాధించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తర్వాత అనేక రికార్డులను ఖాతాలో వేసుకుంటుంది. మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ల కలెక్షన్ల విషయంలో కూడా తన జోరు కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం యూఎస్‌లో మార్చి 24న హాలీవుడ్ చిత్రాలు ‘ది లాస్ట్ సిటీ’, ‘ది బ్యాట్ మ్యాన్’ చిత్రాల వసూళ్లను బ్రేక్ చేసినట్లు సమాచారం. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ఆస్ట్రేలియన్ బాక్సాపీస్ వద్ద ‘ది బ్యాట్‌మాన్’ మూవీ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసినట్లు సమాచారం.
Recent Comment