టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగారూపొందుతున్న సినిమా “శభాష్ మిథు”. కథానాయిక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీ అంచాలను నెలకొల్పాయి. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియో నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలోకి జట్టును గెలిపించడానికి నేనున్నానంటూ బ్యాట్‌ను పైకెత్తుతూ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఈ టీజర్ చూసిన క్రికెట్ అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసకిత్గా ఎదురు చూస్తున్నారు. 2005, 2007లో ప్రపంచ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ జట్టుకు మిథాలీ నాయకత్వం వహించింది. కాగా, ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా తాప్సీ ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Recent Comment