Radhe Shyam డిజిటల్ రైట్స్‌కు కళ్ళుచెదిరే ధర.. ప్రముఖ సంస్థ జోరు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’(Radhe Shyam) . పూజ హెగ్డే కథానాయిక. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో ప్రభాస్(Prabhas) విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే(Pooja hegde) ప్రేరణగా నటిస్తోంది. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు(Krishnam raju) ఈ సినిమాను సమర్పిస్తుండగా.. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.
రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులకు భారీ మొత్తం లభించిందని సమాచారం. రాధేశ్యామ్ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలకు కలిపి దాదాపు 150కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Recent Comment