Another rare tribute to RRR movie: ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పై ‘ఆర్ఆర్ఆర్’.. మురిసిపోతున్న ఫ్యాన్స్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్)(RRR). చారిత్రక పాత్రలకు ఫిక్షనల్ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, ఆయన జోడీగా అలియాభట్ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ సందడి చేయనున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదల కానుంది.
అలాగే ఈ సినిమా ప్రీమియర్ షో ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ అయిన యూకే లోని ఓడియన్ బిఎఫ్ఐ ఐమ్యాక్స్ థియేటర్ లో ప్రదర్శింపబడనుంది. యూకె(UK)లో మొత్తంగా 1000కిపైగా స్ర్కీన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుండడం విశేషం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్(Ajay Devgan), అలియా భట్(Alia bhatt) వంటి బాలీవుడ్ స్టార్స్‌తోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు.
Recent Comment