టీమిండియాలో (India)లో ఎంతోమంది టాలెంటెడ్ ఆటగాళ్ళు ఉన్నారు. వీరిలో ఐపీఎల్(IPL) ద్వారా టీమ్ ఇండియాకి(Team India) దొరికిన మరో అద్భుతమైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Surya kumar yadav). ఐపీఎల్ (IPL)ముంబై ఇండియన్స్ (Mi)తరుపున భారీ స్కోర్స్ చేసి టీమిండియాలో చోటు కొట్టేసిన సూర్య కుమార్ ఇటీవల జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ (IND vs WI ) తో అద్భుత ప్రదర్శన చేశాడు .ఈ మ్యాచ్లో 34 పరుగులు చేసిన Surya kunar yadav టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతకి మీద ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక తనలో ఉన్న మరో టాలెంట్ కూడా బయటపెట్టేందుకు సూర్య కుమార్ యాదవ్ రెడీ అయ్యాడు. కెప్టెన్ నమ్మకం ఉంచి బౌలింగ్ వేయమని చెప్తే బౌలింగ్ చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపాడు.అందుకే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూనే టీంలో ఉన్న బౌలర్ల దగ్గర సలహాలు తీసుకుంటున్నా అని తెలియజేశాడు. ఎప్పుడు తన చేతికి బంతి ఇచ్చినా కూడా తాను బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటానని సూర్య కుమార్ యాదవ్ తెలియజేశాడు .మరి బ్యాటింగ్ లో అదరగొడుతున్న ఈ యువ బ్యాట్స్మెన్, బౌలింగ్ కూడా రాణించి టీమిండియాకు (Team India)మరో ఆల్ రౌండర్ గా ఎదుగుతాడేమో చూడాలి .ఇక ఇండియా వెస్టిండీస్ (IND vs WI )జట్ల మధ్య రెండవ t20 మ్యాచ్ ఈరోజు రాత్రి జరగనుంది.
Recent Comment