ధర్మశాల వేదిక గా భారత, శ్రీ లంకల మధ్య జరిగిన మూడవది, చివరిదైన T20 లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ లంక (Sri Lanka) ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీ లంక ను కెప్టెన్ శనాక తన అద్భుతమైన ఆట తో ఆదుకున్నాడు. కేవలం 38 బంతుల్లో 74 పరుగులు చేసి శ్రీలంక కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.
భారత (India) బౌలర్ల లో అవేశ్ ఖాన్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ (Rohit Sharma) రూపం లో మొదటి వికెట్ కోల్పోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు.
శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. జడేజా 22 పరుగులతో తనవంతు సహకారాన్నందించాడు.
147 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్ల లో కరిగించేసారు. శ్రేయాస్ అయ్యర్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. మరికొన్ని రోజులలో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కి భారత్ సిద్ధమవ్వాలి
Recent Comment