బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 328 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. డెవాన్ కాన్వాయ్ 122 పరుగులు చేయగా, యంగ్ 52 పరుగులు, నికోలస్ 75 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, మిరాజ్ చెరి మూడు వికెట్లు తీశారు.
ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 458 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హాసన్ జాయ్ (78) , శాంటో (64), మోమినుల్ హాక్(88), లిట్టన్ దాస్ (86) అర్ధ సెంచరీ లతో రాణించారు. బౌలింగ్ లో రాణించిన మిరాజ్, బ్యాటింగ్ లోనూ రాణించి 47 పరుగులు చేశాడు. మిరాజ్ పరుగులతో రాణించాడు. బౌలర్ల లో బౌల్ట్ 4 వికెట్లు తీయగా, వాగ్నెర్ 3, సౌథీ 2 వికెట్లు తీశారు.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 169 పరుగులకే కుప్పకూలింది. యంగ్ 69 పరుగులు, టేలర్ 40 పరుగులు చేశారు. ఐదుగురు న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డక్ అవుట్ అయ్యారు. బంగ్లా బౌలర్ ల లో ఏబాదత్ హుస్సేన్ అద్బుతం బౌలింగ్ చేసి 6 వికెట్లతో రాణించాడు. టస్మిన్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు.
అనంతరం 40 పరుగుల స్వల్ప లక్ష్యం తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
7 వికెట్లు తీసిన ఏబాదత్ హుస్సేన్, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వరుస పరాజయా లకు బంగ్లాదేశ్ అడ్డుకట్ట వేయగలిగింది.
అమెజాన్ ప్రైమ్ ఈ మ్యాచ్ తో స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ మ్యాచ్ హైలైట్స్ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లాగ్ ఇన్ అవ్వాల్సిందే.
Recent Comment