మోహన్ బాబుకి (Mohan Babu )ఎన్నడూ లేని విధంగా ఈసారి అనుకోని పరాజయం ఎదురవటం సినిమా ఇండస్ట్రీలో షాక్ గురిచేస్తోంది. మోహన్ బాబు(Mohan babu ) హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా (Son of India ) సినిమా ఘోర పరాజయం అయ్యింది. ఈ సినిమాకి కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. . ఎటువంటి హంగామా లేకుండా సన్ అఫ్ ఇండియా థియేటర్స్ కి రావండంతో ప్రేక్షకులకు పెద్దగా చూడానికి ఇంట్రెస్ట్ చూపలేదు.

ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 11లక్ష లు, రెండో రోజు 10లక్షలు,ముడో రోజు 3 లక్షలు ఇక నాలుగో రోజు6 లక్షలు వరకు ఈ చిత్రం కలెక్షన్లు తెచ్చుకుంది.వరల్డ్ వైల్డ్ గా ఈ సినిమా కనీసం 35 లక్షలు కూడా దాటలేక పోయింది.ఇక ఈ సినిమాపై ట్రోల్స్ కూడా అధికంగా వచ్చాయి. మొత్తానికి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ ని అందుకున్నాడు మోహన్ బాబు.