కంప్యూటర్ (Computer)యుగంలో ఇపుడు ప్రతి ఒక్కరు మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఎక్కువ అవ్వడంతో మొబైల్ లో యాప్స్ కూడా రకరకాలుగా వస్తున్నాయి. ఇక వాట్సప్(Whatsapp) అనేది ప్రపంచంలో అందరూ వినియోగించే యాప్.ఈ యాప్ రకరకాల ఎమోజీలు కూడా వినియోగం లో ఉన్నాయి.ఇక ఈ యాప్ మీద కొన్ని ఆంక్షలు వచ్చాయి.అవి పాటించక పోతే జైలు శిక్ష అలాగే లక్షల్లో ఫైన్ విధించేందుకు సిద్ధం అయ్యారు.
సౌదీ అరేబియాలో వాట్సాప్ (Whatsapp )ఉపయోగించే వారికి నిబంధనలు పెట్టారు. వాట్సాప్లో లవ్ కి గుర్తుగా రెడ్ హార్ట్ ఎమోజీని మరో పర్సన్ కి ఇష్టం లేకుండా పంపిస్తే అది వేధింపులతో సమానమైన నేరంగా ప్రకటించారు. ఇలా రెడ్ హార్ట్ ఎమోజీని పంపించిన వారికి 20 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు.అదే నేరం మళ్ళీ ఎక్కువ టైమ్స్ చేసి దోషిగా ప్రూవ్ అయితే ఐదేళ్ల జైలు శిక్ష,60 లక్షలు ఫైన్ వేస్తారు. ఇలాంటి నిబంధనాతో అక్కడి ప్రజలకు పెద్ద చిక్కు వచ్చి పడింది.
Recent Comment