యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. కాగా, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమనికి ‘జాతిరత్నాలు’ మూవీ హీరో నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే అసలు ఈ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత తీసుకున్నాడు ? అసలు అతడిని ఈ ఈవెంట్‌కి హోస్టింగ్ చేయమని ఎవరు సూచించారు? అనే అంశాలపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్‌తో ఉన్న అనుబంధం కారణంగానే నవీన్‌ పొలిశెట్టి ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి యాంకర్ గా  చేయడానికి అంగీకరించాడట. అయితే అతన్ని ప్రభాస్ కు రిఫర్ చెలింది మాత్రం ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అని తెలుస్తోంది. ఎందుకంటే నవీన్‌ పొలిశెట్టి కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. చిచోరే సినిమాతో హిందీ అభిమానులకి బాగా చేరువయ్యాడు. అందుకే అతన్ని యాంకర్ గా చేయిస్తే బావుంటుందని ప్రభాస్‌కి  నాగ్‌ అశ్విన్‌ చెప్పాడట. దీంతో ప్రభాస్‌ కూడా ఇందుకు వెంటనే ఓకే చెప్పాడట.

ఇక నవీన్‌ పోలిశెట్టి నటించిన ‘జాతిరత్నాలు’ సినిమా ట్రైలర్‌ని ప్రభాస్ విడుదల చేసి, కావాల్సినంత ప్రమోషన్స్ కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అనుబంధాన్ని గుర్తుపెట్టుకొనే ‘రాధే