పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి హీరోలుగా టాలీవుడ్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీంలా నాయక్. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇన్ని రోజులు విడుదల తేదీ కన్ఫ్యూజన్ లో ఉన్న భీంలా నాయక్ ఎట్టకేలకు ఈనెల 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది .ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి .మాస్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ ని చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంచనాలను మరింత పెంచేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది .ఈనెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఈ ట్రైలర్ ఒక మాస్ జాతరగా ఉంటుందని సమాచారం .ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు పోటీపడి నటించిన సన్నివేశాలను చూపించబోతున్నారు. ఇక వారి యాక్షన్ కి తగ్గట్టుగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టినట్టు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న భీంలా నాయక్ ట్రైలర్ యూట్యూబ్ లో ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొట్టిందో చూడాలి.