టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మంచి విజయాలను అందుకుంటోంది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ గెలిచిన భారత్, టి20 లో కూడా మొదటి మ్యాచ్లో సూపర్ విక్టరీ కొట్టింది.ఇక మొదటి మ్యాచ్ తర్వాత టీమిండియా యంగ్ ప్లేయర్ కి క్లాస్ పీకాడట రోహిత్ శర్మ .వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచ్లో యువ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు . 42 బంతులు ఆడి 35 పరుగులు మాత్రమే చేసాడు. ఇక స్పిన్ ఆడడం లో బాగా ఇబంది పడ్డాడు. టీమ్ ఇండియాకి ఆడటం అతనిలో ఒత్తిడిని పెంచింది. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తెలియ చేసాడు. జట్టులో ఓపెనర్ గా అయినా మిడిల్ లో అయిన ఒత్తిడి లేకుండా ఆడాలని, భారత్ జెర్సీ వేశాకా ప్లేయర్స్ కి ఒత్తిడి సహజం అని దాన్ని అధిగమించి బ్యాటింగ్ లో సత్తా చాటాలని తెలిపాడు. ఇక మొదటి మ్యాచ్ లో విజయం కొట్టిన భారత్ రేపు జరిగే రెండో టీ 20 లో గెలిచి సిరీస్ గెలవాలని భావిస్తోంది.