టీమిండియా, వెస్టిండీస్ (IND vs WI )మధ్య జరుగుతున్న మూడో టీ20 (3rd T20మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ కోహ్లీ, రిషబ్ పంత్ కి రెస్ట్ ఇచ్చారు. ఇక ఋతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(Ishan Kishan ) భారత(India) ఇన్నింగ్స్ ని ఆరంభించారు. గైక్వాడ్ 4 పరుగులకే ఔట్ అయ్యాడు.ఇక ఇషాన్ కిషన్ 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.శ్రేయస్ అయ్యర్(Sreyas) 25 ,రోహిత్ 7 (Rohit Sharma )పరుగులు చేశారు. ఇక సూర్య కుమార్ యాదవ్ (Surya kumar )దుమ్మురేపాడు.31 బంతుల్లో 65 పరుగులు చేసాడు. ఇక వెంకటేష్ అయ్యర్ కూడా 35 పరుగులతో రాణించడంతో భారత్ 20 ఓవర్స్ లో 5 వికెట్లు కోల్పయి184 పరుగులు చేసింది.వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్,షెపేర్డ్,రోస్టన్ షెస్,వాల్ష్,డ్రాక్స్ తలో ఒకటి తీశారు.ఇక 185 పరుగుల లక్ష్యంతో వెస్టిండీస్ బరిలోకి దిగుతోంది.