ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా ను చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది.  ఇప్పుడు భీమ్లా నాయక్ సంక్రాంతి  కి వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కోసం వెనక్కి తగ్గిన భీమ్లా నాయక్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడడంతో మళ్ళి సంక్రాంతి కి తీసుకు రావాలని చిత్ర బృందం ఆలోచించవచ్చు.   రాధే శ్యామ్, బంగార్రాజు ఇప్పటికే సంక్రాంతి రేసును మొదలు పెట్టాయి.  భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి కి వస్తే తెలుగు ప్రేక్షకులకు నిజమైన పెద్ద పండగే ఈ సంక్రాంతి.

రాధే శ్యామ్ ఒక అందమైన ప్రేమ కధలా కనపడుతోంది, బంగార్రాజు కుటుంబ కథా చిత్రం లా కనపడుతోంది.  వీటి మధ్యలో భీమ్లా నాయక్ కచ్చితం గా మాస్ ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కోవిద్ సమయంలో రిలీజ్ చేయడం కొత్త కాదు.  వకీల్ సాబ్ ఇలాంటి సమయంలోనే వచ్చి వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.  కాబట్టి ఈ సంక్రాంతి రసవత్తరం గా మారాలంటే భీమ్లా నాయక్ అడుగు పెట్టాల్సిందే అని సగటు సినీ మరియు పవన్ కళ్యాణ్ అభిమాని కోరుకుంటాడనడంలో సందేహం లేదు.