పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్‌ల వస్తున్న మల్టిస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్‌ ఫిబ్రవరి 25కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కానీ  , ఆర్ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌ వంటి పెద్ద సినిమాల కోసం భీమ్లానాయక్‌ను చిత్రబృందం వాయిదా వేసింది. ఇదిలాఉండగా, మళ్ళీ సంక్రాంతి రేస్ నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో మళ్ళీ “భీమ్లా నాయక్” విడుదల తేదీపై ఆసక్తి రేగింది. కానీ ఈ సినిమా సంక్రాంతి రేస్ లో విడుదల కాదట.. ముందుగా ప్రకటించినట్లే ఫిబ్రవరిలో విడుదల అవుతుందట.

ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాకి ఇంకా బ్యాక్రౌండ్ స్కోర్ వర్క్ మిగిలి ఉందట.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాకి వర్క్ చేస్తూ ఉండడం వల్ల భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదలవ్వడం సాధ్యపడదు అని తెలుస్తుంది.