పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,(Pawan kalyan )రానా దగ్గుబాటి( Rana daggubati ) కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ భీంలా నాయక్ ( Bheemla Nayak ). ఈ మూవీపై భారీ అంచనాలతో ఉన్నారు. సంక్రాంతికి రావాల్సిన భీంలా నాయక్ ( Bheemla Nayak ) మూవీ పెద్ద సినిమాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫిబ్రవరి 25న రిలీజ్ అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి, కానీ అదే రోజు మూడు సినిమాలు ఉండటంతో పవర్ స్టార్ థియేటర్ లోకి వస్తాడా లేదా అనే అనుమానాలు తలెత్తాయి .కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక పవర్ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ (Pawan kalyan )లుక్ అదిరిపోయింది .మాస్ జాతర చూపించేందుకు రెడీగా ఉండండి అంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చారు మేకర్స్ .ఇప్పటికే భీంలా నాయక్ ( Bheemla Nayak ) నుండి విడుదలైన పాటలు, టీజర్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఖచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి కలిసి ఎలాంటి రికార్డ్స్ బద్ధలు కొడతాయో అమ్మడి ఆసక్తికరంగా మారింది