పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ) మొదటిసారిగా రాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్ . దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియా బిగ్గెస్ట్ సినిమాగా ఆదిపురుష్ రాబోతోంది. ప్రభాస్ ని రాముడిగా చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగష్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఆదిపురుష్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దానికి కారణం అమీర్ ఖాన్ నటిస్తున్న మూవీ. బాలీవుడ్ భారీ అంచనాలతో వస్తోంది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ. ఈ మూవీని మొదట ఏప్రిల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దాంతో అమీర్ ఖాన్ మీద ఉన్న రెస్పెక్ట్ తో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాని వాయిదా వేసుకున్నాడు. దాంతో లాల్ సింగ్ చద్దా యూనిట్ ప్రభాస్ కు థాంక్స్ చెప్తూ ట్విట్ చేశారు .మరి వాయిదా పడిన ఆది పురుష్ రిలీజ్ ఎప్పుడవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది