పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ ( Radhe Shyam) చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన ప్రభాస్ ( Prabhas ) మరో సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు.మహానటి ఫెమ్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ ప్రాజెక్టు కె ( Project K ) చిత్రం తీస్తున్న సంగతి తెలిసందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో డార్లింగ్ ప్రభాస్ పాల్గొంటున్నారు.బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ( Deepika Padukone ) ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. అలాగే ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ( Amitab Bachhan ) కీలక పాత్రలో నటిస్తున్నారు. (Project K ) ప్రాజెక్టు కె చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ వేశారు.ఈ సెట్ లో ప్రధాన నటి నటుల మీద కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత c.అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.
సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు.డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కె చిత్రం పాన్ ఇండియ సినిమా కాదని పాన్ వరల్డ్ చిత్రం అని ఇది వరకే ప్రకటించారు. ఆ స్థాయిని రీచ్ అయ్యేలా మూవీని తీర్చి దిద్దేదుకు చిత్ర యూనిట్ కష్ట పడుతోంది.2023 లో ప్రాజెక్టు కె ( project K ) సినిమా విడుదల అవుతుంది.