స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun ), రష్మిక మందన(Rashmika Mandana ) జంటగా వచ్చిన సినిమా పుష్ప(Pushpa). బాక్సాఫీస్ వద్ద తగ్గేదెలే అన్నట్టు కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమాకి సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించాడు. ఇప్పుడు పుష్పది రూల్ కూడా ఎన్నో అంచనాలతో తెరకెక్కనుంది.వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ ఏడాది చివరికి సినిమాని కూడా రిలీజ్ చేయాలనె ఆలోచనలో ఉన్నాడు అల్లుఅర్జున్ (Allu Arjun ).ఇక పుష్ప సినిమా హిందిలోను మంచి హిట్ కొట్టింది. దాంతో పుష్ప ది రూల్ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

పుష్ప ది రైస్ లో ఎర్రచందనం స్మగ్లర్ బన్నీ ఎలా ఎదిగాడు అన్నది చూపించిన సుకుమార్ పుష్ప ది రైస్ లో బన్నీ(Bunny ) ఆ సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేసాడు అన్నది చూపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. పార్ట్ 2 లో బాలీవుడ్ (Bollywood)నటి నటులను కుడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీ నటులు పుష్ప ది రైస్ (Pushpa 2 )లో నటిస్తే మూవీ మీద హైప్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.ఒక బడా హిందీ స్టార్ ని పుష్ప మూవీ కోసం తీసుకోవాలని సుకుమార్(Sukumar ) ప్లాన్ చేసాడు.ఆ స్టార్ తో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ స్టార్ యాక్టర్ ని అఫిషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది