చదరంగంలో ( Chess )ప్రపంచ రికార్డ్ నమోదు అయింది.ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్ సన్ ని ఒక చిన్న కుర్రాడు గేమ్ లో ఓడించాడు.భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Pragnanadha ) వరల్డ్ రికార్డ్ నమోదు చేసాడు.
ఎయిర్ థింగ్స్ మాస్టర్ చెస్ లో ఆర్ ప్రజ్ఞానంద ,మాగ్నస్ కార్ల్ సన్ పోటీ పడ్డారు.ఈ పోటీలో 8వ రౌండ్ లో మాగ్నాస్ మీద ప్రజ్ఞానంద గెలిచాడు.

ఆన్లైన్ లో జరిగిన రాపిడ్ టోర్నమెంట్ ఇది.
ఈ గేమ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 వ ఎత్తులో విజయం సాధించాడు.ప్రపంచ నెంబవ్ ర్యాంకర్ ని ఓడించడంతో ప్రజ్ఞానంద పేరు మారు మోగుతోంది.సోషల్ మీడియాలో కూడా ప్రజ్ఞానందకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక తనని ఓడించిన యువ గ్రాండ్ మాస్టర్ ని అభినందించారు మాగ్నస్ కార్ల్ సన్