సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్(Chris Gayle ) కోచ్ గా మారబోతున్నాడు. ఇన్నాళ్లు తన సిక్సులతో భారీ స్కోరు చేస్తూ అభిమానులను అలరించిన గేల్ ,ఇప్పుడు కోచ్ గా కొత్త అవతారం ఎత్తుతున్నారు .పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL ) లో ఒక టీం అయిన కరాచీ కింగ్స్ (KK)టీంకి హెడ్ కోచ్ గా వెళ్ల పోతున్నట్లు గేల్ ట్విట్టర్లో తెలిపారు. ఈ టీంకి బాబర్ ఆజమ్ కెప్టెన్ గా ఉన్నారు .ప్రస్తుతం సీజన్లో కరాటే కింగ్స్ తొమ్మిది మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది .

ఇక క్రిస్ గేల్(Chris Gayle ) లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ కరాచీ కింగ్స్ టీంకి కోచ్ గా నియమించడంతో ఆ టీం బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి .మరి గేల్ కోచింగ్ లో వచ్చే సీజన్లో కరాచీ కింగ్స్ ఎలా రాణిస్తుందో చూడాలి