ప్రభాస్ ,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. మార్చి 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.Radhe Shyam విడుదలకు టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో వాలెంటెన్స్ డే సందర్భంగా మరో క్రేజీ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో prabhas, pooja Hegde మంచు కురుస్తుంటే ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ పోస్టర్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇక లవ్ కి డెస్టినికి మధ్య జరిగే బిగ్గెస్ట్ వార్ radhe shyam అంటూ పోస్టర్ తెలియజేశారు .ఈ వార్ ని చూడాలంటే మార్చ్ 11 వరకు ఆగాల్సిందే.ఇక ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన అన్ని పోస్టర్స్, టీజర్స్, పాటలు మంచి హిట్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన radhe shyam కోవిడ్ కారణంగా మార్చి 11న విడుదల కాబోతోంది .ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ ,మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు .ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మరి ఈ సినిమా హిట్ అవ్వాలంటే భారీ లెవల్లో కలెక్షన్స్ సాధించాలి. బాహుబలి2 తర్వాత సాహో తో అంతగా ఆకట్టుకోలేకపోయినా prabhas, radhe shyam తో బిగ్గెస్ట్ హిట్ సాధిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.