క్రికెట్ లో ఒక బ్యాటర్ ని ఔట్ చేయడానికి ఫీల్డర్లు ,బౌలర్లు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయంలో క్రీడాస్ఫూర్తిని కూడా మర్చిపోయి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తుంటారు. కానీ కొందరు మాత్రం క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. ఇలాంటి ఒక ఘటన ఐర్లాండ్ ,నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్ ని నేపాల్ బౌలర్ కమల్ సింగ్ వేశాడు .ఈ ఓవర్లో పరుగు తీసే సమయంలో ఐర్లాండ్ బ్యాటర్ ఆండీ మైక్ బ్రెయిన్ కిందపడిపోయాడు. ఇక బౌలర్ కమల్ సింగ్ బంతి అందుకుని కీపర్ కు త్రో విసరగా కీపర్ ఆశిప్ షేక్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. కింద పడిపోయి క్రీజ్లోకి రాలేకపోయినా ఐర్లాండ్ బ్యాటర్ ని ఔట్ చేయకుండా తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు, టీవీ యంపైర్లు కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ ఇలాంటి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం మంచి పరిణామం అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ ఘటనతో క్రీడా స్ఫూర్తి చాటుకున్న వారిలో 2022 జాబితాలో నేపాల్ కీపర్ ఆసిఫ్ షేక్ చేరారు .ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.