కళ్యాణ్ రామ్( Kalyan Ram ) తో మొదటిసారిగా పటాస్ సినిమా తీసాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ) .ఈ సినిమా సక్సెస్ కావడంతో మంచి గుర్తింపు పొందాడు. ఇక వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూవచ్చాడు.ఇక అనిల్ రావిపూడి f3 చిత్రం మే 27న ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విచడానికి రానుంది.ఇక తనకి మొదటి మూవీ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్(Kalyan Ram ) తో మరోక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.ఇది పటాస్(Patas ) మూవీకి సీక్వెల్ అని తెలుస్తోంది.దానికి పటాస్ 2 టైటిల్ ని పెట్టాలని ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట.

అయితే మరో వైపు కళ్యాణ్ రామ్(Anil Ravipudi ),అనీల్ రావి పూడికి(Anil Ravipudi ) మనస్పర్థలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది . అయితే ఇవన్ని ఒట్టి రూమర్స్ అని అనీల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక కళ్యాణ్ రామ్ తో ఈ దర్శకుడు సినిమా ఎప్పుడు మొదలు పెడతాడన్నది చూడాలి.వీరి కాంబినేషన్ లో వచ్చిన పటాస్ సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్(Kalyan Ram ) కెరీర్ లో పటాస్ బిగ్గెస్ట్ గా నిలిచింది.