టాలీవుడ్(Tollywood ) హీరోయిన్ కావ్యా థాపర్(Kavya Thapar ) ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కావ్యా తెలుగు లో వచ్చిన ఏక్ మినీ కథ( Ek mini katha ) మూవీలో హీరోయిన్ గా నటించింది.ముంబై (Mumbai )లో గురువారం ఆమె మద్యం తాగి కారు నడిపారు. అలా నడపడమే కాకుండా ఒక వ్యక్తిని కారుతో గుద్ది అతనికి గాయం అయ్యేలా చేసింది. దాంతో ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు.ఇక పోలీసులతో ఆమె దురుసుగా మాట్లాడం ,బూతులు తిట్టడం, మద్యం సేవించి కార్ నడపడం వంటి వాటిపై ముంబై పోలీసులు కేస్ నమోదు చేశారు.ముంబైలోని అంతేరి కోర్ట్ లో కావ్యా థాపర్ ( Kavya Thapar ) ని హాజరు పరచి, జ్యుడీషియల్ కస్టడీ విధించారు.ఆమె అరెస్ట్ అవ్వడం,మద్యం సేవించి పోలీసులతో గొడవ పడే వీడియో వైరల్ గా మారాయి.