నేచురల్ స్టార్ నాని (Nani)మరో కొత్త మూవీని మొదలు పెట్టాడు.నాని హీరోగా దసరా(Dasara )అనే మూవీని ప్రకటించారు.ఈరోజు నాని(Nani) దసరా(Dasara) మూవీ పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు.శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త డైరెక్టర్ ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.దసరా(Dasara) మూవీలో నానికి జోడిగా కీర్తి సురేష్(Keerthy Suresh ) నటిస్తున్నారు. నాని ,కీర్తి కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి ఈ జంట కలిసి నటిస్తున్నారు.దసరా సినిమాను సింగరేణి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీలో నాని(Nani) తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు తేలుస్తోంది.దసరా (Dasara)మూవీని దసరా పండగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లవ్ అండ్ మాస్ ఎంటర్ టైన్ గా దసరా మూవీ రాబోతోంది. శ్యామ్ సింగరాయ్(Shyam singh roy) తో హిట్ కొట్టిన నాని దసరా మూవీతో మరో హిట్ సాధిస్తాడేమో చూడాలి.