పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి హీరోలుగా మల్టీ స్టారర్ గా వస్తున్న మరో టాలీవుడ్ క్రేజీ మూవీ భీంలా నాయక్ Bheemla Nayak. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుం కొషియం మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. త్వరలో భీంలా నాయక్ చిత్రం నుండి వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో (Pawan Kalyan ) పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు .ఈ పోస్టర్ చూస్తుంటే విడుదల చేయబోయే సాంగ్ లో పవన్ కళ్యాణ్ చూసి అభిమానులు పండగ చేసుకునేలా ఉంది .ఇక త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని తెలియజేశారు .ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 50% మాత్రమే ఆడియన్స్ కి థియేటర్స్ లో అనుమతి ఉంది .పూర్తి స్థాయిలో 100% ఆడియన్స్ కి థియేటర్స్ లో అనుమతి లభించగానే భీంలా నాయక్ మూవీని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియజేశారు. మరి భారీ అంచనాలతో వస్తున్న భీంలా నాయక్ ( Bheemla Nayak ) ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Recent Comment