దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియాభట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్నారు. ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీల్లో భారీ అంచనాలున్నాయి. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల రిలీజ్ కానుంది. అయితే విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్‌ చేస్తోంది.

ఇటీవల ముంబైలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించిన మేకర్స్.. తాజాగా చెన్నైలో ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ పై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఇంటర్వెల్ సీన్ ను ఫ్యాన్స్ ఏ మాత్రం ఊహించరని అన్నాడు. భావోద్వేగాలతో ముడిపడిన ఈ భారీ యాక్షన్ సీన్ దాదాపు 16 నిమిషాలు సాగుతుందట. బ్రిటీష్ వారి ఆధీనంలో పోలీసాఫీసర్ గా పనిచేస్తున్న రామ్ చరణ్, అలాగే వారికి వ్యతిరేకంగా పోరాడే ఎన్టీఆర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడట. అప్పుడు వీరిద్దరి మధ్య  ఉహాకందని రీతిలో భారీ ఫైట్ సీన్ తెరకెక్కించారట జక్కన. కాగా, డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీత స్వరాలు అందించారు