యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నటించిన రాధేశ్యామ్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకుంటుండగా.. ఆయన నటించిన ‘స‌లార్’ , ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితోపాటుగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ‘స్పిరిట్’ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే వీటితో పాటుగా ప్రభాస్‌ మారుతీ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం కోసం ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌ను హాట్ టాపిక్ గా మారింది. తాజా స‌మాచారం ప్రకారం మారుతితో చేయనున్న సినిమా కోసం ప్ర‌భాస్ దాదాపు 75కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్న‌ట్లు టాక్‌ వినిపిస్తోంది. ప్ర‌భాస్ ఈ సినిమాకు 60రోజుల డేట్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దాంతో సగటున ఈ సినిమా కోసం ప్ర‌భాస్ రోజుకు 1.25 కోట్ల వ‌ర‌కు రెమ్యునరేషన్ అందుకొనున్నాడు.