మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్రలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్‌కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్రంలో సోనూసూద్ కీలక పాత్ర పోషించారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆచార్య చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ… చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఇక ఈ పాటలో రెజీనాతో పాటుగా చిరంజీవి అదిరిపోయే స్టెప్పులు వేశారు. కాగా ఇప్పటికే ఆచార్య చిత్రంలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
Recent Comment