జీ తెలుగు (Zee Telugu) ఛానల్ స రి గ మ ప (Sa Re Ga Ma Pa) 14వ సీజన్ ఈ రోజు (27th Feb) నుండి ప్రారంభమవుతోంది.  గత ఆదివారం స రి గ మ ప ను లాంచ్ ఈవెంట్ తో ఘనం గా ప్రారంభించారు.  ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.

ఈ కార్యక్రమం మొదలవకుండానే పార్వతి (Parvathi) , ప్రణవ్ (Pranav) ల కు మంచి ఫాలోయింగ్ వచ్చింది.  పార్వతి చాలా చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తోంది. ప్రణవ్ కు అయితే అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.

ఈ కార్యక్రమానికి శైలజ (Shailaja) గారు, కోటి (Koti) గారు, హాయ్ రబ్బ స్మిత (Smitha) గారు మరియు అనంత శ్రీరామ్ (Anantha Sriram) గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.  శ్రీముఖి (Sreemukhi) యాంకర్.  స రి గ మ ప కు, మరింతగా ఆడియన్స్ ను రాబట్టడానికి, దీనికి ముందు వరుడు కావలెను (Varudu Kavalenu) ప్రీమియర్ వేస్తున్నారు.

 దీని కి రెండు రోజుల ముందే ఆహా (Aha) లో తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) ప్రారంభమైంది.  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman), సింగర్ కార్తీక్ (Karthik), నిత్యామీనన్ (Nithya Menon) లు న్యాయ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.  బిగ్ బాస్ (Bigg Boss)ఫేం శ్రీరామ చంద్ర (Sreerama Chandra) దీనికి యాంకర్. ఈ మధ్యనే ఈటీవీ పాడుతా తీయగా కొత్త సీజన్ ను ప్రారంభించింది.  ఔత్సాహికులకు ఇదొక సువర్ణావకాశం.