నేచురల్ స్టార్ నాని ( Nani ) అభిమానుల కోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాని పుట్టినరోజు(Nani Birthday ) సందర్భంగా ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో అంటే సుందరానికి(Ante Sundaraniki ) సినిమా నుండి ఒక టీజర్ విడుదల చేసారు మేకర్స్ .ఈ టీజర్ లో నాని కి గంఢాలు ఉన్నాయని బ్రాహ్మణులు చెప్పడంతో చిన్నప్పటి నుండి గంఢ నివారణ పరిహార హోమాలు చేయిస్తుంటారు నాని కుటుంభ సభ్యులు. ఈ హోమాలు చేయటం ఇక నావల్ల కాదు, నేను చేయలేను అంటు తల్లితో లబో దిబో అంటునే పూజా కార్యక్రమాలు అయిష్టంగా పూర్తి చేస్తాడు.

ఈ టీజర్ చూస్తుంటే మంచి వినోదం పంచేలా ఉన్నాడు నాని. టీజర్ లో నాని(Nani ) చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమా పెద్ద వాల్ల నుండి చిన్న పిల్లల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది.అంటే సుందరానికి (Ante Sundaraniki )మూవీని వివేక్ ఆత్రేయ (Vivek Athreya )దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది.అతి త్వరలోనే అంటే సుందరానికి చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.