రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(RAM CHARAN) హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)(RRR). ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తునున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా.. అజయ్ దేవ్‌గన్, సముద్రఖని, శ్రీయ ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

కాగా, మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా తొలి రివ్యూను ఈ చిత్రానికి క‌ల‌రిస్ట్ గా పనిచేసిన శివ‌కుమార్ ఇచ్చేశాడు. “తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీని చూశాను. ఆ సినిమాకి పనిచేసిన చేసిన ఒక కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్ ను వెయ్యిసార్లు చూశాను. ఈ సినిమా ఆఖరి కాపీ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాను. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం 3000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం ఖాయం అని కలరిస్టు శివకుమార్ ట్వీట్ చేశారు.