మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan ) హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కియార అద్వానీ(Kaira Advani ) హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఒక కీలక పాత్రలో మన తెలుగ అమ్మాయి అంజలి (Anjali )కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఇటీవల వకిల్ సాబ్ లో ప్రధాన పాత్రలో మెప్పించిన అంజలి ,ఇపుడు రామ్ చరణ్ (Ram charan )సినిమాలో కూడా చేయటం ఆమె అభిమానులకి ఆనందాన్ని కలిగిస్తోంది.ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. ఆమెకు అవకాశాలు అంతగా రావడంతో లేదు,ఇలాంటి సమయంలో చరణ్, శంకర్ (Shankar )లాంటి పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం ఆమెకు లక్ అని చెప్పాలి.

ఇక ఈ చిత్రాన్ని శంకర్(Shankar ) భారీ స్థాయిలో తీస్తున్నాడు. ఇక ఇటీవల లీక్ అయిన చరణ్ లుక్స్ కూడా అదిరిపోయాయి.ఆర్సీ15(Rc 15) టైటిల్ పేరుతో పిలువబడుతున్న ఈ సినిమాకి SS తమన్ సంగీతం అందిస్తున్నాడు. కియార అద్వానీతో ఇంతకు ముందే రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా పెద్ద సక్సెస్ కాలేక పోయింది. ఆర్సీ15 హిట్ అవుతుందేమో చూడాలి.