ఆర్ ఆర్ ఆర్ ,ఆచార్య తరువాత రాం చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC15.స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ నుండి మొదటి అప్డేట్ రానుంది .శివరాత్రి కానుకగా rc15 నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. శివరాత్రికి రాబోయే ఫస్ట్ లుక్ లో rc 15 ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.ఈ మూవీని కమేర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు shankar.