నందమూరి బాలకృష్ణ (Balakrishna), శృతిహాసన్(Shruthi hassan ) కలిసి నటిస్తున్న సినిమాకి గోపిచంద్ మలినేని(Gopi chandh) దర్శకత్వం వహిస్తున్నారు.అఖండ సినిమా ఎంతటి ఘనవిజయం సాదించిందో తెలిసిందే. ఇదే జోష్ మీద ఉన్న బాలయ్య తన తదుపరి సినిమా గోపిచంద్ మలినేనితో రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 18న సిరిసిల్లలో మొదలు పెట్టాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్న పాత్రలు చేస్తున్నాడు .nbk107 సినిమా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇక రాయలసీమలో యాసలో బాలకృష్ణతో దుమ్మురేపేలా డైలాగ్స్ ఉండబోతున్నాయి. Nbk107 నుండి మొదటి రోజే బాలయ్య లుక్ రివీల్ అయ్యింది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య లుక్ అదిరింది.అయితే బాలయ్య సక్సెస్ ఉన్న దర్శకుల పైనే ఫోకస్ పెడుతున్నాడు.ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడితో (Anil Ravipudi )సినిమా కమిట్ అయ్యాడు. ఇక వరుస సినిమాలు ఓకే చేస్తు నందమూరి బాలకృష్ణ అభిమానులుకి సంతోషాన్ని పంచుతున్నాడు. బాలకృష్ణ ఎనర్జీ చూస్తుంటే వరుస హిట్స్ కొట్టడం ఖాయం అని టాలీవుడ్ (Tollywood )లో ముచ్ఛట్లు జోరుగా సాగుతున్నాయి.