2022 ఐపీఎల్ మెగా వేలు ముగిసింది .అన్ని టీమ్స్ స్టార్ ప్లేయర్స్ ని కొనుగోలు చేయగా ఎప్పటిలాగానే సన్రైజర్స్ హైదరాబాద్ తక్కువ ఖర్చుతో స్టార్ ప్లేయర్ కంటే నార్మల్ ప్లేస్ కి మొగ్గు చూపింది .కానీ ఇప్పటి నుండే తమ మ్యాచ్లకు ప్లేయర్స్ ను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తమ ఓపెనింగ్ జోడి ని ప్రకటించింది. Srh టీమ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ సీజన్లో తమ టీం తరఫున బరిలోకి దిగే ఓపెనింగ్ జోడి ఇదే అని తెలియజేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ టీం తరఫునుంచి 2022 ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్ విలియమ్సన్, యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడిగా రాబోతున్నారు అంటూ మురళీధరన్ చెప్పుకొచ్చాడు . అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్లో 22 మ్యాచ్ లు ఆడి 241 పరుగులు చేసాడు. అలాగే బౌలింగ్ లో కూడా ఏడు వికెట్లు తీసుకున్నాడు .మరి కెన్ విలియంసన్, అభిషేక్ శర్మ జోడి ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కి మంచి ఆరంభాలు ఇస్తుందో లేదో చూడాలి మరి
Recent Comment