భారత్ ,వెస్టిండీస్ (IND Vs WI ) మధ్య బుధవారం నుండి టి20 సిరీస్ మొదలు కానుంది .ఇరు జట్లు స్టార్ ఆటగాళ్లతో సమానంగా ఉన్నాయి. ఇక వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ టి20 సిరీస్ గెలిచి పరువు నిలుపుకోవాలని ఆలోచిస్తుండగా, టి 20 సిరీస్ కుడా గెలవాలని భారత్ భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటిదాకా వెస్టిండీస్, భారత్ 17 T20 మ్యాచ్ ల్లో తలపడ్డాయి .వీటిలో 10 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది .ఇక 6 మ్యాచుల్లో వెస్టిండీస్ విజయం సాధించింది, ఒక మ్యాచ్ మాత్రం ఫలితం తేలలేదు .ఇక ఇండియాలో జరిగిన మ్యాచుల్లో అయితే టీమిండియా వెస్టిండీస్ మీద పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత గడ్డపై జరిగిన వాటిలో 5 మ్యాచుల్లో టీం ఇండియా గెలవగా,వెస్టిండీస్ రెండు మాత్రమే గెలిచింది. అలాగే కరేబియన్ గడ్డపై వెస్టిండీస్ 2 ,భారత్ 2 గెలిచి సమానంగా నిలిచాయి. టి-20ల్లో వెస్టిండీస్ పై ఆధిపత్యం చెలాయించిన భారత్ అదే స్థాయిలో బుధవారం నుండి మొదలయ్యే టీ20 సిరీస్ లో కూడా స్థాయికి తగ్గట్టు ఆడి సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉంది.