టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి ( Rishab Panth ) ప్రమోషన్ లభించింది. వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్లో రిషబ్ పంత్ ( Rishab Panth ) నీ వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇటీవల కాలంలో టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు, అలాగే IPL లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అందుకే రిషబ్ పంత్ కి ( Rishab Panth ) టి20 సిరీస్ కి వైస్ కెప్టెన్ గా నియమించారు. ముందుగా (IND vs WI ) వెస్టిండీస్ జరిగే టి20 సిరీస్ కి కేఎల్ రాహుల్ ( KL Rahul )ని వైస్ కెప్టెన్ గా నియమించగా అతను గాయం కారణంతో ఈ సిరీస్ కు దూరమయ్యాడు. దాంతో ఇప్పుడు వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ రిషబ్ పంత్ కి ( Rishab Pant ) లభించింది .ఈనెల 16 నుండి టీమ్ ఇండియా, వెస్టిండీస్ ( IND vs Wi )జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈనెల 16, 18, 20 తేదీల్లో వరుసగా మూడు మ్యాచ్ టీ20 సిరీస్ జరుగనుంది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు t20 సిరీస్ పై కన్నేసింది. ఇక వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ సాధించిన రిషబ్ పంత్ ( Rishab Pant ) t20 సిరీస్ లో ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.