టాలీవుడ్ లో వెంకటేష్ (Venkatesh ),వరుణ్ తేజ్ (Varun Tej )హీరోలుగా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న సినిమా F3. మే 27న ప్రేక్షకులను అలరించడానికి రెడి అవుతోంది . వెంకటేష్ (Venkatesh ),వరుణ్ తేజ్ (Varun Tej ) ఇద్దరు పోటీ పడి మరీ ఈ మూవీలో నటిస్తున్నారు.ఇటీవల రిలీజ్ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రియమైన పిల్లల్లార, పెద్దల్లార ఈ వేసవి వినోదం కోసం సిద్దంగా ఉండండి .మీ సమ్మర్ సెలబ్రేషన్స్ కోసం మా సినిమా డేట్ ని కూడ ఖరారు చేసాము ,మే 27వ తేదిన మీముందుకు వస్తోంది,మస్తు వినోదభరితమైన F3 అంటూ ప్రకటించారు.అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన f2కి సీక్వెల్ గా f3 వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ని శివరాత్రికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన లబ్ డబ్ సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఇక క్రేజీ మూవీగా వస్తున్న F3 ఎలా ప్రేక్షకులను నవ్విస్తుందో చూడాలి