వెంకటేష్ (Venkatesh ) ,వరుణ్ తేజ్(Varun Tej ) హీరోలుగా టాలీవుడ్ లో వస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్ f3.గతంలో వచ్చిన f2 కి సీక్వెల్ గా ఈ మూవీ వస్తోంది. f3 ని అనీల్ రావిపూడి (anil ravipudi )దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల మొదటి పాటని రిలీజ్ చేయగా మంచి హిట్ అయింది. ఇపుడు మరో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మహా శివరాత్రి కానుకగా f3 నుండి రెండో పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. వెంకటేష్ కి జోడిగా తమన్నా, వరుణ్ కి జోడిగా మెహరిన్ నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు.

సమ్మర్ కానుకగా మే27న గ్రాండ్ గా విడుదల కానుంది. లబ్ డబ్ అనే మొదటి పాట హిట్ కావడంతో రెండో పాటను కూడా అదే స్థాయిలో డిజైన్ చేస్తున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్(DSP ). మరి ఈ పాట ఎలాంటి రికార్డ్స్ బద్ధలు కొడుతుందో చూడాలి.