బిగ్‌బాస్‌ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ ఓటీటీ (Bigg Boss OTT) ప్రోమో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానున్న ఈ మెగా షోకు మరోసారి కింగ్ నాగార్జుననే(nagarjuna) వ్యాఖ్యాతగా ఉండనున్నారు. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షోను తాజాగా నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ అంటూ ప్రోమోపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. హిందీ తరహాలోనే తెలుగులో కూడా తొలిసారి 24గంటల పాటు బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రసారం అవుతందని తెలియడంతో… అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ 84 రోజులు అంటే దాదాపు 12 వారాలు ఉండే ఛాన్స్ ఉంది..మరికొద్ది రోజుల్లో ఈ మెగా షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్‌బాస్‌ తొలి సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ ఎవరనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్‌-1నుంచి బిగ్ బాస్ సీజన్‌-5 వరకు ఒక్కో సీజన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్‌బాస్‌ ఓటీటీలోకి ఎంపికచేసినట్లు తెలుస్తుంది. అలాగే యూట్యూబ్‌, ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా నుంచి కొందరు సెలెబ్రెటీలను కూడా ఇందులోకి తీసుకున్నట్లు సమాచారం.

కాగా, బిగ్‌బాస్‌ ఓటీటీకి ఎంపికైన కంటెస్టెంట్ల లిస్ట్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మరి ఆ జాబితాలో ఉన్న కంటెస్టెంట్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. ఆదర్శ్‌( సీజన్‌-1)
2. ముమైత్‌ ఖాన్‌(సీజన్‌-1)
3. ధనరాజ్‌(సీజన్‌-1)
4. తనీష్‌(సీజన్‌-2)
5.మహేష్‌ విట్టా(సీజన్‌-3)
6. అషు రెడ్డి( సీజన్‌-3)
7.అఖిల్‌ సార్థక్‌(సీజన్‌-4)
8. అరియానా(సీజన్‌-4)
9.నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5)
10. సరయూ( సీజన్‌-5)

వీరితోపాటుగా.. కొత్తగా వస్తున్న వాళ్లు ఎవరంటే..

11 ‘నగ్నం’ సుందరి శ్రీరాపాక,
12. బమ్‌ చిక్‌ బబ్లూ,
13. మోడల్‌ మిత్రా శర్మ
14. యాంకర్‌ శివ ,
15. యాంకర్‌ స్రవంతి,
16. ఆర్జే చైతు,
17. యూట్యూబర్‌ నిఖిల్‌,
18. మోడల్‌ అనిల్‌ రాథోడ్‌ లు ఉన్నారు.