పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan ) నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ భీంలా నాయక్ (Bheemla Nayak ) .సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవ్వాలి కానీ కోవిడ్ తో పాటు మరికొన్ని కారణాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న లేదా మార్చి 1న విడుదల చేస్తామంటూ ముందుగా ప్రకటించారు. కానీ దర్శక నిర్మాతలు, హీరోతో చర్చించి ఫిబ్రవరి 25న రిలీజ్ కి ఫిక్స్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ మీద అందరికీ దృష్టి పడింది. ఈవెంట్ కి సంబంధించిన ప్లానింగ్ ఆల్రెడీ లాక్ చేసినట్టు సమాచారం .ఇదే ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు .ఈ ఈవెంట్ కి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (pawan kalyan )తో మూవీస్ తీస్తున్న అందరు డైరెక్టర్స్ ఈ మూవీకి హాజరుకానున్నారు. హరిహర వీరమల్లు (Harihara veeramallu) డైరెక్టర్ క్రిష్(Krish),భవదీయుడు భగత్ సింగ్ (Bavadheeyudu bagath singh ) డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish shankar)అలాగే పవన్ తో మూవీ చేయబోతున్న సురేందర్రెడ్డి (Surendar reddy)ఈ వేడుకలో పాల్గొంటారు. వీళ్లే కాకుండా ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఇందులో పాల్గొంటారని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న భీంలా నాయక్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి