ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా గత ఏడాది థియేటర్స్‌లో మంచి విజయం సాధించింది. ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈలోపు తన తర్వాతి సినిమాలకు సంబంధించిన పనులపై ఫోకస్‌ పెట్టినట్లున్నారు అల్లు అర్జున్‌.
తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ లో అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాకి సంబంధించి క్రేజీ అనౌన్స్ మెంట్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్రమంలో బ‌న్నీ ఎలాంటి ప్రకటన చేయనున్నారని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవ‌ల బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీని అల్లు అర్జున్ క‌లిసారు కాబ‌ట్టి ఆయ‌న‌తో సినిమాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు కాబట్టి ఆ రోజునే ఈ బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని అభిమానులు అనుకుంటున్నారు.