Aadavallu Meeku Joharlu Movie: శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”.. క్లీన్ హిట్ కోసం ఎంత రాబట్టాలంటే!

శర్వానంద్(Sharwanand), రష్మిక మందన్నా9Rashmika Mandanna), జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu Meeku Joharlu) దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్(Sri Lakshmi Venkateswara Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 4న ఈ మూవీ విడుదల కానుంది. చక్కటి ప్రమోషన్స్ భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రానికి గాను మేకర్స్ రీసెంట్ రన్ టైంని లాక్ చేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా 141 నిమిషాలు నిడివి ఉంటుందని సమాచారం. అంటే సుమారు రెండు గంటల 21 నిమిషాలు అని చెప్పాలి.

అంతే కాకుండా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీకి 16 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే 16.5 కోట్ల షేర్‌ను సాధించాలి. ఇక ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం 7 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించాల్సి ఉంటుంది. అలా జరిగితేనే సేఫ్ జోన్ లోకి ఎంటరవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.