నెంబర్ వన్ హీరో చిరంజీవి (ఈ రోజు చిరంజీవి కొత్త గా ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు), ఆర్ ఆర్ ఆర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్, వీళ్లిద్దరికీ తోడు కొరటాల శివ దర్శకత్వం. ఇక అంచనాలు ఆకాశాన్ని తాకుతాయనడం లో సందేహం లేదు.
అయితే ఆచార్య సినిమా విడుదలైన తరువాత మెగా అభిమానులందరికి ఒక పెద్ద షాక్. చిరంజీవి కెరీర్ లో ఆచార్య సినిమా ఒక బ్లాక్ మార్క్ గా నిలిచి పోతుంది. ఒక చిరంజీవి అభిమానిగా, 152 సినిమాల లో నన్ను బాగా నిరుత్సాహ పరిచిన చిత్రం ఆచార్య.
ఒక దర్శకుడి గా కొరటాల శివ ఐదేళ్లలో చేసిన సినిమాలు నాలుగు. ఆ తరవాత చేసిన ఐదవ సినిమా కి నాలుగేళ్ళు పట్టింది(కరోనా విరామం తో కలిపి). 2018 ఏప్రిల్ లో రిలీజ్ అయిన భరత్ అనే నేను సినిమా తరవాత కొరటాల శివ చేసిన చిత్రం ఆచార్య. మొత్తం గా కొరటాల శివ గత పదేళ్లలో దర్శకత్వం వహించిన సినిమాలు ఐదు. గత నాలుగు సినిమాలు చూస్తే కొరటాల శివ ఖచ్చితం గా నమ్మదగ్గ దర్శకుడే.
ఇక లోతుగా విశ్లేషణ చేస్తే, ఆచార్య సినిమా చూసిన తరువాత నా మదిలో మెదిలిన ప్రశ్నలు.
- అంత శ్రద్ధగా సినిమాలకు కథలు రాసే కొరటాల శివ ఆచార్య కు సరైన కధ ఎందుకు రాయలేకపోయాడు?
- విసుగెత్తించిన కధ, కధనాలు…. నీరసంగా సాగిన కధనం.
- ఆచార్య డైలాగ్స్(మాటలు) ఇంత దారుణం గా కొరటాల శివ ఎలా రాసాడు?
- ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం చేశాడా
- ఆచార్య కు స్క్రీన్ ప్లే సమకూర్చింది కొరటాల శివ లేదా వేరెవరైనా..?
- కొరటాల శివ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన సన్నివేశాలకు నిజం గా దర్శకత్వం వహించ లేదా.! ఒక దర్శకుడిగా దర్శకత్వం చేయకుండా ఏం చేసినట్టు..! మిలియన్ డాలర్ల ప్రశ్న
- ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వేసిన ధర్మస్థలి, పదఘట్టాలను సారిగా చూపించడం లో కూడా కొరటాల శివ విఫలమయ్యాడు
- రెజినా తో పాట అవసరమా…
- లాహే లాహే, నీలాంబరి పాటలు ఆడియో లో విన్నప్పుడు, సినిమాలో చూసినప్పటికీ తేడా తెలియలేదు
- ఉన్న పాటల్లో కాస్త పరవాలేదనిపించిన పాట భలే భలే బంజారా. అయితే ఈ పాట కి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ దారుణం గా ఉంది
- సంగీతం గురించి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత దారుణం గా ఉంది
- సోను సూద్ విలన్ క్యారెక్టర్, 20 సంవత్సరాల క్రితం రాసినట్లుగా ఉంది.
- చిరంజీవి సినిమా కి హీరోయిన్ లేకపోవడం, అసలు చెప్పాలంటే చిరంజీవి కే సరైన క్యారెక్టర్ రాయలేదు కొరటాల శివ.. చిరంజీవి ఇంట్రడక్షన్ చాల సింపుల్ గా తేల్చేశాడు
- నక్సల్ బాక్ డ్రాప్ అవసరమా.!!!!! లాల్ సలాం, కామ్రేడ్ పదాలు చిరంజీవి సినిమాలో.. అయ్యో ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు
- మధ్య లో మైనింగ్ మాఫియా కధ లోకి రావడం…!!!!
- పూజా హెగ్డే కి ప్రాధాన్యం లేక పోవడం
- రామ్ చరణ్ సత్యదేవ్ కొడుకు, చిరంజీవి సత్యదేవ్ ని శంకరన్న అని పిలవడం ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు.
- కధ ఏమి లేని ఈ సినిమా కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అవసరమా
- చిరంజీవి అంటేనే హాస్యం, హీరోయిన్ తో రొమాన్స్, ఫ్యామిలీ, ఎమోషన్స్ – వీటి ఊసే లేదు ఆచార్య సినిమా లో
- రామ్ చరణ్ అద్భుతం గా నటించినా బలమైన సన్నివేశాలు రాసుకోకపోవడం వలన, సినిమా తేలిపోయింది
- 151 సినిమాల అనుభవం, 3 దశాతాబ్దాలు వెండితెరను ఏలిన చిరంజీవి ఆచార్య సినిమా ను కధ లో జోక్యం చేసుకుని పాడు చేస్తారా … నమ్మశక్యం గా లేదు.!
- ఆచార్య సినిమా టైటిల్స్ దగ్గర నుండి, అన్ని డిపార్ట్మెంట్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యిన సినిమా. మెగా అభిమానులకు తీవ్ర వేదనను మిగిల్చిన సినిమా. తలెత్తుకోలేని సినిమా.
- చిరంజీవి ప్లాప్ సినిమాలు సైతం 50 రోజులు ఆడతాయి. అలాంటి చిరంజీవి సినిమా ‘ఆచార్య’ రెండవ రోజు హౌస్ ఫుల్ కాకపోవడం …మెగా అభిమానుల బాధ వర్ణనాతీతం
- కధ మీద కొరటాల కసరత్తు చేయలేదా, confuse అయ్యాడా.!!! కధ లేకపోతే, చిరంజీవి కి కధ లేదని చెప్పచు కదా. కధ కాని ఈ కధ తో మెగా అభిమానులకు కొరటాల శివ మిగిల్చిన వ్యధ ఈ ఆచార్య.
- ఆచార్య సినిమా తో ముఖ్యం గా గుణపాఠం నేర్చుకోవాల్సింది కొరటాల శివ. పొరపాటు ఎక్కడ జరిగింది అని లోతైన విశ్లేషణ చేసుకోవాలి. తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న, ఈ సమయం లో ఆచార్య లాంటి సినిమా రావడం, అందునా కొరటాల శివ దర్శకుడు కావడం, ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించడం మరింత బాధాకరం
- ఈ తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు గా చిరంజీవి గారి సినిమాలు ఉండాలని కోరుకుంటూ ….త్వరగా ఈ బాధనుండి మెగా అభిమానులు కోలుకోవాలని ఆశిస్తూ… జై చిరంజీవ. మేము ఎప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులమే
Recent Comment