మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) కథానాయకుడుగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్గా నటించగా.. రామ్ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మంగళవారం రోజు సాయంత్రం విడుదల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ తమదైన నటనతో దుమ్మురేపారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆఖరివరకు ఆకట్టుకునేలా సాగింది. అయితే తాజాగా ఆచార్య మూవీ ట్రైలర్ టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సాధించింది. ఆచార్య ట్రైలర్ 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
Recent Comment